: కరీనా కపూర్ తల్లి కాబోతోందా?
ప్రముఖ నటి కరీనా కపూర్ తల్లి కాబోతోందని బాలీవుడ్ కోడైకూస్తోంది. కరీనా కపూర్ ప్రస్తుతం మూడు నెలల గర్భంతో ఉందని, ఆ ఆనందంతోనే భర్తతో కలసి లండన్ పర్యటనకు వెళ్లిందని వార్తలు వినపడుతున్నాయి. గతంలో ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు ఖండించిన సైఫీనా (సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఖాన్) దంపతులు ఈసారి మాత్రం మౌనంగా ఉన్నారు. దీంతో కరీనా గర్భందాల్చడం నిజమేనని బాలీవుడ్ లో కథనాలు వెలువడుతున్నాయి.