: భారతరత్న లతామంగేష్కర్ ను 'నేపథ్య గాయనిగా పిలవబడే...' అంటూ అవమానించిన న్యూయార్క్ టైమ్స్!
భారతరత్న గ్రహీతలు లతా మంగేష్కర్, సచిన్ టెండూల్కర్ లపై కమేడియన్ తన్మయా భట్ రూపొందించిన స్నాప్ చాట్ వీడియో జోక్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కాగా, అంతర్జాతీయ మీడియా సైతం దీనికి ప్రాముఖ్యత ఇచ్చింది. ఇదే విషయమై ఓ కథనాన్ని ప్రచురిస్తూ, 86 ఏళ్ల గాయనీమణి, అభిమానులు గానకోకిలగా పిలుచుకునే లతా మంగేష్కర్ ను యూఎస్ దినపత్రిక 'న్యూయార్క్ టైమ్స్' అవమానించింది. ఆమె పేరును ప్రస్తావిస్తూ, 'నేపథ్య గాయనిగా పిలవబడే...' (సోకాల్డ్ ప్లేబ్యాక్ సింగర్) అంటూ పేర్కొని భారత పాఠకుల ఆగ్రహానికి గురైంది. న్యూయార్క్ టైమ్స్ లతమ్మను అవమానించిందని పత్రిక చూసిన ప్రవాస భారతీయులు సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తున్నారు.