: సురేష్ ప్రభు ఎన్నికకు, రైల్వే జోన్ కు సంబంధం లేదు: కంభంపాటి


రైల్వే మంత్రి సురేష్ ప్రభు రాజ్యసభకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నిక కావడానికి, విశాఖపట్నానికి రైల్వే జోన్ ప్రకటించడానికి సంబంధం లేదని బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు తెలిపారు. రైల్వే జోన్ పై స్పష్టత లేదంటూనే, తన పదవీకాలం పూర్తయ్యేలోగా రైల్వే జోన్ తెప్పిస్తానని ఆయన స్పష్టం చేశారు. విశాఖలో రైల్వే జోన్ ను దక్షిణ మధ్య రైల్వే వ్యతిరేకిస్తోందని చెప్పిన హరిబాబు, కొన్ని సాంకేతిక కారణాలు అడ్డురాకుంటే, ఇప్పటికే జోన్ ప్రకటన వచ్చి వుండేదని స్పష్టం చేశారు. కాగా, నిన్న నామినేషన్ వేసేందుకు హైదరాబాద్ వచ్చిన సమయంలో సురేష్ ప్రభు, ఏపీ వాసులు ఎంతో ఎదురుచూస్తున్న జోన్ విషయంలో ఒక్క మాటైనా మాట్లాడలేదని విపక్షాలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News