: నీ పాపం పండే రోజు త్వరలోనే వస్తుంది!: చంద్రబాబుపై జగన్ నిప్పులు


ప్రజలను అన్ని రకాలుగా మోసం చేస్తున్న సీఎం చంద్రబాబునాయుడు పాపం పండే రోజు త్వరలోనే రానుందని వైకాపా అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ప్రజలు ఎన్నుకొన్న నేతలను కోట్ల రూపాయలతో కొనుగోలు చేస్తున్నాడని, ఆ పాపానికి శిక్షను అనుభవించే రోజు త్వరలోనే వస్తుందని తెలిపారు. నేడు అనంతపురం జిల్లాలో జరిగిన రైతు భరోసా యాత్రలో పాల్గొన్న ఆయన, రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, తమ పార్టీ రైతులు, బడుగుల పక్షాన నిలిచి పోరాడుతుందని అన్నారు. రైతుల రుణమాఫీని పక్కన పెట్టిన బాబు, వడ్డీల రూపంలో అదనపు భారం మోపారని నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కోటానుకోట్ల డబ్బు ఎక్కడి నుంచి వస్తోందో ప్రజలు నిలదీయాలని జగన్ పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News