: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సెల్ ఫోన్ ‘సొలారిన్’
ఇజ్రాయెల్ దేశానికి చెందిన సిరిన్ ల్యాబ్స్ అనే కంపెనీ తయారు చేసిన స్మార్ట్ ఫోన్ ప్రపంచలోనే అత్యంత ఖరీదైందట. ఈ విషయాన్ని సదరు సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. లండన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ ఫోన్ ను లాంచ్ చేశారు. అత్యంత ఖరీదైన ఈ ఫోన్ కు ‘సొలారిన్’ అని పేరు పెట్టారు. 4 వేల డాలర్లు ఖరీదు చేసే ఈ ఫోన్ ప్రత్యేకతలు... 5.5 అంగుళాల స్క్రీన్, 810 క్వాల్ కమ్ స్పాప్ డ్రాగన్ ప్రాసెసర్, 23.8 ఎంపీ కెమెరా వంటి ఫీచర్లతో ఈ ఫోన్ ను తయారు చేశారు.