: ఇంధన ధరలు తగ్గించండి!: మోదీకి ‘అమ్మ’ లేఖ
వరుసగా రెండో దఫా తమిళనాడులో అధికార పగ్గాలు చేపట్టిన అన్నాడీఎంకే అధినేత్రి, తమిళ తంబీలు ‘అమ్మ’ అంటూ ఆప్యాయంగా పిలుచుకునే జయలలిత కేంద్రానికి లేఖల పర్వాన్ని ప్రారంభించారు. ఇప్పటికే నీట్ కు సంబంధించి తమకు మినహాయింపునివ్వాలని అధికార పగ్గాలు చేపట్టిన మరునాడే ప్రధాని నరేంద్ర మోదీకి ఆమె లేఖ రాశారు. తాజాగా నిన్న రాత్రి దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఆమె ప్రధాని కార్యాలయానికి మరో లేఖను రాశారు.