: యూపీలో దారుణం.. సెల్ఫీ తీసుకుందాం అంటూ గంగానదిలో భార్యను తోసేసి చంపిన వైనం
యూపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అక్కడి మీరట్‌లో ఓ వ్యక్తి తన భార్యతో సెల్ఫీ తీసుకుందాం అని చెప్పి, గంగానది వద్దకు తీసుకెళ్లి నదిలో తోసేశాడు. అదనపు కట్నం కోసం భార్య ఆయేషాతో తరుచూ తగాదాలు పెట్టుకుంటోన్న ఆఫ్తాబ్ అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అనంతరం ఈ ఉదంతాన్ని పక్కదారి పట్టించడానికి తన ఎనిమిది నెలల కొడుకుతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి కొందరు దుండగులు తమపై దాడి చేశారని, ఆ గొడవలో తన భార్యను గంగా నదిలో తోసేశారని పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఆఫ్తాబ్ తమకు ఫిర్యాదు చేసే క్రమంలో అనుమానం రావడంతో పోలీసులు ఆయనపై పలు ప్రశ్నలు వేశారు. అనంతరం ఆఫ్తాబే సెల్ఫీ వంకతో భార్యను గంగా నదిలో తోసేసి చంపాడని కేసు నమోదు చేశారు. ఆఫ్తాబ్ తో పాటు తన అన్న షెహజాద్ మీద కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.