: టీఆర్ఎస్‌లో ఎందుకు చేరుతున్నానంటే..? కార‌ణాలు చెప్పిన ఎంపీ మ‌ల్లారెడ్డి


కాసేప‌ట్లో హైద‌రాబాద్‌లోని సీఎం క్యాంపు ఆఫీస్‌లో కేసీఆర్ స‌మ‌క్షంలో అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాన‌ని టీడీపీ ఎంపీ మ‌ల్లారెడ్డి ఓ టీవీ ఛాన‌ల్‌కిచ్చిన ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వ ప‌థ‌కాలు త‌న‌ను ఆక‌ర్షించాయ‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న తెలిపారు. మిష‌న్ కాక‌తీయ‌, మిష‌న్ భ‌గీర‌థ‌, డ‌బుల్ బెడ్‌రూమ్ ఇళ్లు వంటి ప‌థ‌కాల‌తో టీఆర్ఎస్ మంచి పాల‌న‌ను అందిస్తోంద‌ని ఆయ‌న అన్నారు. బంగారు తెలంగాణ‌లో తాను కూడా భాగ‌స్వామి కానున్నాన‌ని ఆయ‌న అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం త‌న వంతు కృషి చేస్తాన‌ని ఆయ‌న పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News