: ఢిల్లీలో ‘ఇంటర్నేషనల్ జంగిల్ రాజ్’.. ఆఫ్రికన్ విద్యార్థులపై దాడుల అంశంలో జేడీయూ స్పందన
ఢిల్లీలో ‘ఇంటర్నేషనల్ జంగిల్ రాజ్’ ఉందని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) నాయకుడు కేసీ త్యాగి అన్నారు. ఓ జాతీయ ఛానల్‌కి వచ్చిన ఇంటర్వ్యూలో ఈరోజు ఉదయం ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో ఆఫ్రికన్ విద్యార్థులపై దాడులు జరుగుతుండడం అక్కడ ఇంటర్నేషన్ జంగిల్ రాజ్ కి నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు. ఢిల్లీ పోలీసులు ఆఫ్రికన్ విద్యార్థుల దాడులపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు కొనసాగించడంపై ఈ అంశం అడ్డుగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఆఫ్రికన్ విద్యార్థులపై దాడులను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలిపారు.