: బీజేపీ రాజ్యసభ అభ్యర్థిపై ఏకంగా 28 కేసులు
భారతీయ జనతా పార్టీ రాజ్యసభ అభ్యర్థి గోపాల్ నారాయణ్ సింగ్‌పై ఏకంగా 28 కేసులున్నాయట. బీహార్ నుంచి బీజేపీ తరఫున రాజ్యసభ సీటు కోసం టికెట్ పొందిన నారాయణ సింగ్ గురించి ఆ రాష్ట్ర అధికార పార్టీ జనతాదళ్ యునైటెడ్ పలు విమర్శలు గుప్పించింది. ఆయనపై ఇప్పటి వరకు 28 సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొంది. నామినేషన్ దాఖలు చేస్తూ నారాయణ సింగ్ తనపై ఉన్న కేసులన్నీ రాజకీయ స్వార్థప్రయోజనాల కోసం కొందరు పెట్టినవేనని పేర్కొన్నారు. జేడీయూ నేత సంజయ్ సింగ్ ఈరోజు ఈ అంశంపై బీహార్‌లో మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా గోపాల్ నారాయణ్ సింగ్ ను ఎంపిక చేయడం ఆ పార్టీ వైఖరిని స్పష్టీకరిస్తోందని విమర్శించారు. బీజేపీలో ఎంతో మంది అర్హులైన నేతలుండగా గోపాల్ నారాయణ్ సింగ్ నే తమ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించిందని, దీంతో ఆ పార్టీ దారులు ఎటుగా ఉన్నాయో.. వారి దృక్పథం ఎలాగుందో తెలుస్తోందని ఆయన అన్నారు.