: సబ్సిడీ రహిత వంట గ్యాస్ ధర కూడా పెంపు!
గత రాత్రి పెట్రోలు, డీజిల్ ధరలను పెంచిన ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు, నేడు రాయితీ రహిత వంటగ్యాస్ ధరను, విమాన ఇంధన ధరను పెంచుతున్నట్టు ప్రకటించాయి. రాయితీ లేని వంట గ్యాస్ ధరను రూ. 21 మేరకు పెంచుతున్నట్టు ఓఎంసీ (ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్) వెల్లడించాయి. విమాన ఇంధన ధరను 9.2 శాతం పెంచుతున్నట్టు తెలిపాయి. పెరిగిన ధరల తరువాత 14.2 కిలోల సిలిండర్ ధర ఢిల్లీలో రూ.548.50, కోల్ కతా లో రూ. 576, ముంబైలో రూ. 547కు పెరిగింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19.2 కిలోల సిలిండర్ల ధర ఢిల్లీలో రూ. 979, కోల్ కతాలో రూ. 1052, ముంబైలో రూ. 1016గా ఉండనుంది.