: కేసీఆర్ వారసుడి గురించి అడిగితే హరీశ్ రావు ఇచ్చిన సమాధానం ఇది!
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండేళ్లు పూర్తయి, ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ, మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్న వేళ, నీటిపారుదల మంత్రి హరీశ్ రావు, తనకు ఎదురయ్యే ఇబ్బందికర ప్రశ్నలకు తెలివిగా సమాధానం ఇస్తున్నారు. కేసీఆర్ కు వారసుడు ఎవరు? అన్న ప్రశ్నకు... మరో ఇరవై సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉంటారని, ఇక వారసుడు ఎవరన్న ప్రశ్న ఎలా ఉత్పన్నమవుతుందని ఎదురు ప్రశ్నించారు. వారసుడిపై చర్చ అసందర్భమని అన్నారు. పార్టీలో నెంబర్ గేమ్ సాగడం లేదని, తన అనుచరులకు పదవులు రావడం లేదన్న ప్రచారమూ వాస్తవం కాదని అన్నారు. కాగా, తన కుమారుడు కేటీఆర్ ను వారసుడిగా తయారు చేసుకుంటున్న కేసీఆర్, మేనల్లుడు హరీశ్ రావును పక్కన పెడుతున్నారన్న ఊహాగానాలు వస్తున్న వేళ, హరీశ్ ఈ సమాధానం చెప్పడం గమనార్హం.