: రేపటి దీక్ష ఎలా కొనసాగిద్దాం..? కాసేపట్లో విజయవాడలో మంత్రులతో చంద్రబాబు భేటీ
రేపు ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించనున్న నవనిర్మాణ దీక్ష కోసం నిన్న అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు మంత్రులతో దీక్షపై చర్చించనున్నారు. కాసేపట్లో విజయవాడలో మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. నవ నిర్మాణ దీక్ష సహా వారం రోజుల పాటు ఏపీలో చేపట్టనున్న కార్యక్రమాలు, ఇతర అంశాలపై చంద్రబాబు మంత్రులతో చర్చిస్తారు. మరోవైపు తెలంగాణలో రేపు నిర్వహించాల్సిన రాష్ట్రావతరణ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా పలు చోట్ల రాష్ట్రావతరణ వేడుకలు నిర్వహించనున్నారు. తెలంగాణ ఏర్పడి రెండేళ్లు గడుస్తోన్న సందర్భంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ప్రతిభ కనబర్చిన పలువురికి ప్రతిభ అవార్డులను ఇవ్వనుంది.