: బర్త్ డే పార్టీలో కత్తుల స్వైర విహారం... యాదగిరీశుడి సాక్షిగా యువకుడి మృతి
నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహుడి సాక్షిగా నిన్న రాత్రి జరిగిన ఓ వ్యక్తి జన్మదిన వేడుకల్లో కత్తులు స్వైర విహారం చేశాయి. గుట్టపై ఆలయానికి దూరంగా జరిగిన ఈ ఘటనలో యాదగిరిగుట్టకే చెందిన భాస్కర్ అనే యువకుడు చనిపోయాడు.. బర్త్ డే వేడుకల్లో భాగంగా స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్న భాస్కర్ పై అతడి మిత్రులే దాడికి దిగారు. వ్యక్తిగత తగాదాలతో మొదలైన ఈ ఘర్షణలో భాస్కర్ తేరుకునేలోగానే అతడి మిత్రులు కత్తులతో పొడిచేశారు. తీవ్ర గాయాలతో పడిపోయిన భాస్కర్ ను ఆసుపత్రికి తరలిస్తుండగానే అతడు చనిపోయాడు.