: రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న సచిన్ దంపతులు, హీరోలు చిరంజీవి, నాగార్జున


రేపు పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. క్రికెట్ లెజెండ్ సచిన్, ఆయన భార్య అంజలి తిరుమల చేరుకున్నారు. తెలుగు అగ్రహీరోలు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, నిర్మాతలు అల్లు అరవింద్, బీవీఎస్ఎన్ ప్రసాద్, పారిశ్రామికవేత్తలు నిమ్మగడ్డ ప్రసాద్ తదితరులు ప్రత్యేక విమానంలో ఈరోజు సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. హీరో నాగార్జున, ఇతరులు మరో వాహనంలో కొండపైకి వెళ్లారు. బుధవారం తెల్లవారుజామున వీఐపీ బ్రేక్ దర్శనంలో వీరు స్వామివారిని దర్శించుకోనున్నారు.

  • Loading...

More Telugu News