: కేంద్ర మంత్రి దత్తాత్రేయ సెల్ ఫోన్ చోరీ చేసిన నిందితుడి అరెస్టు


ఈ నెల 15వ తేదీన కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సెల్ ఫోన్ చోరీకి గురైన సంగతి తెలిసిందే. ఈ ఫోనును కొట్టేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు... శ్రీశైలంలో దర్శనం పాస్ ల నిమిత్తం సరూర్ నగర్ కు చెందిన గుమ్మడి రాజ్ కుమార్(52) రాంనగర్ లోని బండారు దత్తాత్రేయ నివాసానికి వెళ్లాడు. ఆ సమయంలో, ముందు గదిలో దత్తాత్రేయ ఫోన్ చార్జింగ్ పెట్టి ఉంది. అంతేకాకుండా, సందర్శకుల తాకిడి కూడా ఎక్కువగా ఉంది. దీంతో, ఎవరూ తనను పట్టించుకోవడం లేదని భావించిన రాజ్ కుమార్ దత్తాత్రేయ సెల్ ను పట్టుకుపోయాడు. కొద్దిసేపటి తర్వాత చూస్తే తన ఫోన్ కనపడకపోవడంతో, దత్తాత్రేయ తన పీఏకు చెప్పడం... ఆయన ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని ఈరోజు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News