: ఆ 570 కోట్ల రూపాయలపై విచారణ చేయండి: డీఎంకే డిమాండ్
తమిళనాడు ఎన్నికల సందర్భంగా మే 13న తిరుపూర్ లో మూడు లారీల్లోని కంటైనర్లలో పట్టుబడిన 570 కోట్ల రూపాయలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష డీఎంకే నేత టీఎస్ ఎలంగోవన్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్, చీఫ్ ఎలక్షన్ కమీషనర్ నజీం జైదీ, సీబీఐ చీఫ్ తదిరులకు లేఖలు రాశారు. 13న పట్టుబడ్డ లారీలను తిరువూరు కలెక్టర్ కార్యాలయానికి తరలించారు. మే 14 నుంచి 17 వరకు ప్రత్యేక భద్రత మధ్య కలెక్టర్ కార్యాలయంలో ఉంచి, అందులో ఉన్నవారు ఏపీకి చెందిన వారని, సివిల్ డ్రెస్సుల్లో ఉన్నారని చెబుతూ, ఏపీ ఎస్బీఐకి చెందిన డబ్బుగా పత్రాలు క్రియేట్ చేసి, ఆ మొత్తాన్ని కోయంబత్తూరు ఎస్బీఐకి తరలించారని ఆయన చెప్పారు. ఈ మొత్తం ఘటనపై విచారణ జరిపి, నిజానిజాలు వెల్లడించాలని ఆయన లేఖలో డిమాండ్ చేశారు.