: దేశంలోని అన్ని గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ సౌకర్యం
దేశంలోని అన్ని గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ సౌకర్యం అందజేస్తామని టెలికాం సెక్రటరీ జేఎస్.దీపక్ తెలిపారు. సెల్యూలార్ ఆపరేషన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో నిర్వహించిన వార్షికోత్సవంలో భాగంగా 'డేటా కనెక్టివిటీ ఫర్ నెక్స్ట్ బిలియన్' అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2018 నాటికి భారత నెట్ ప్రోగ్రాంలో భాగంగా ఆప్టికల్ ఫైబర్ ద్వారా అన్ని గ్రామ పంచాయతీల్లో వైఫై సౌకర్యం తీసుకొస్తామని అన్నారు. 2017 మార్చి నాటికి దేశంలోని లక్ష గ్రామాల్లో 80-100 ఎంబీపీఎస్ వేగం గలిగిన వైఫై సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన తెలిపారు. రెండో దశలో అండర్ గ్రౌండ్ ఫైబర్, రేడియో శాటిలైట్ సదుపాయాలతో వైఫై సర్వీసులు అందుబాటులోకి తెస్తామని ఆయన చెప్పారు. దేశంలోని ప్రతి పౌరుడికీ నెలకు 100 రూపాయలకే డేటాను అందించే చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.