: పశ్చాత్తాపం చెందుతున్న ఆరుగురు మాకు టచ్ లో ఉన్నారు: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వైకాపా
వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన తరువాత, ఇలా ఎందుకు చేశామా? అని బాధపడుతున్న ఆరుగురు ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని వైకాపా నేతలు తెలిపారు. వారంతా పశ్చాత్తాపం చెందుతున్నారని వైకాపా ఎమ్మెల్యేలు కాకాని గోవర్ధన్, ప్రతాప్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ మధ్యాహ్నం నెల్లూరులో మీడియాతో మాట్లాడిన వారు, తెలుగుదేశం నాలుగో అభ్యర్థిని నిలబెట్టినా, తమకు వచ్చే నష్టమేమీ లేదని అన్నారు. విజయసాయిరెడ్డి గెలుపుపై తమకు అనుమానాలు లేవని స్పష్టం చేశారు. తెదేపాలో చేరిన 17 మందిలో తప్పుతెలుసుకున్న అత్యధికులు తిరిగి వెనక్కు రానున్నారని అన్నారు.