: రండి, ఆఫ్రిక‌న్ విద్యార్థుల‌పై దాడుల‌ను ఖండిద్దాం: జ‌ంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ధర్నాకు క‌న్న‌య్య పిలుపు


ఆఫ్రిక‌న్ విద్యార్థుల‌పై భార‌త్‌లో జ‌రుగుతోన్న దాడులను ఖండిస్తూ మ‌రికాసేప‌ట్లో ఢిల్లీలోని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ యూనివ‌ర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడు క‌న్న‌య్య ఆధ్వర్యంలో జంత‌ర్ మంత‌ర్‌ వద్ద ‘మార్చ్ ఫ‌ర్ జ‌స్టిస్’ పేరుతో నిరస‌న ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా దేశ పౌరులు పెద్ద సంఖ్య‌లో జంత‌ర్ మంత‌ర్‌కు చేరుకొని ఆఫ్రిక‌న్ విద్యార్థులపై జ‌రుగుతోన్న దాడుల‌ను ఖండించాల‌ని పిలుపునిచ్చాడు. దేశంలో జాతివివ‌క్ష ఉంద‌ని ఆఫ్రిక‌న్ విద్యార్థుల‌పై తాజాగా జ‌రిగిన దాడుల ద్వారా తెలుస్తోంద‌ని కన్నయ్య అన్నాడు. ఆఫ్రిక‌న్ విద్యార్థుల‌పై దాడుల అంశంలో ప్ర‌భుత్వ వైఖ‌రిని ఖండిస్తున్నట్లు తెలిపాడు. దేశ ప్ర‌జ‌లంద‌రూ గుడ్డిగా అస‌హనాన్ని ప్ర‌ద‌ర్శించేలా ప్ర‌భుత్వం పురిగొల్పుతోంద‌ని ఆయ‌న అన్నాడు. జంత‌ర్ మంత‌ర్‌ వద్ద ప్ర‌భుత్వ వైఖ‌రిని ఎండ‌గ‌డ‌దామ‌ని పిలుపునిచ్చాడు.

  • Loading...

More Telugu News