: నాటి టీడీపీ వేరు... నేటి టీడీపీలో నీతి, నిజాయతీలు లేవు: మాజీ మంత్రి పుష్పరాజ్ సంచలన వ్యాఖ్యలు
పదవుల విషయంలో తనకు ప్రతిసారీ అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజ్ వాపోయారు. ప్రతిసారీ చివరి వరకూ తన పేరు చెబుతూ వచ్చి, ఆపై దూరం పెట్టడం తనకు తీవ్ర మనోవేదనను కలిగిస్తోందని ఆయన అన్నారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన, ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ వేరు, నేటి టీడీపీ వేరని తన ఆవేదనను వెళ్లగక్కారు. తనను గదిలో పెట్టి రాజకీయం నడిపించారని చంద్రబాబు పేరును వెల్లడించకుండా విమర్శలు గుప్పించారు. రాజ్యసభ సీటు ఇస్తానని మోసం చేశారని, నీతి, నిజాయతీకి తెలుగుదేశం పార్టీలో కాలం చెల్లిపోయినట్టు అనిపిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు.