: రాజ్యసభకు విజయసాయిరెడ్డి భార్య సునందారెడ్డి డమ్మీ అభ్యర్థిగా నామినేషన్


వైకాపా తరఫున రాజ్యసభకు పోటీ పడుతున్న విజయసాయిరెడ్డి భార్య సునందారెడ్డి సైతం రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. తన భర్త, కొద్దిమంది వైకాపా నేతలతో కలిసి అసెంబ్లీకి వచ్చిన ఆమె, తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. కాగా, ఆమెది డమ్మీ నామినేషన్ మాత్రమేనని వైకాపా వర్గాలు వెల్లడించాయి. రేపు నామినేషన్ల పరిశీలన అనంతరం, ఆమె విత్ డ్రా చేసుకుంటారని, తెలుగుదేశం పార్టీ ఏదైనా కుట్ర చేసి విజయసాయిరెడ్డి నామినేషన్ ను తిరస్కరించేలా పావులు కదిపిన పక్షంలో సునందారెడ్డి బరిలో ఉంటారని వైకాపా వర్గాలు తెలిపాయి. కాగా, ఇప్పటివరకూ విజయసాయిరెడ్డి మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News