: హనుమజ్జయంతి వేడుకలు: భక్తులతో కిక్కిరిసిపోయిన ‘భద్రాద్రి’
హనుమాన్ దీక్షాధారులతో రాముడు నడియాడిన నేల భద్రాద్రి కిక్కిరిసిపోయింది. హనుమజ్జయంతి వేడుకల సందర్భంగా ఖమ్మం జిల్లా భద్రాచలంలో భక్తుల కోలాహలం కనపడుతోంది. భక్తులు గోదావరి తీరంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. రామాలయ సన్నిధి సహా పలు ఆలయాల్లో భక్తులు ఇరుముళ్లు సమర్పించుకుంటున్నారు. భద్రాద్రి లడ్డూ ప్రసాద కౌంటర్లు కిటకిటలాడుతున్నాయి. 2 లక్షల లడ్డూ ప్రసాదాలను ఈరోజు భక్తుల కోసం అందుబాటులో ఉంచినట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున 3 గంటలనుంచే భక్తులను స్వామి వారి దర్శనం కోసం అనుమతించారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేపట్టారు.