: ‘సోషల్ మీడియా’లో దూసుకుపోతున్న ఏపీ కేబినెట్!... టాప్ లో గంటా, దేవినేనికి సెకండ్ ప్లేస్!


హైటెక్ సీఎంగా పేరుగాంచిన నవ్యాంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు... తన కేబినెట్ సహచరులను కూడా సోషల్ మీడియా బాట పట్టిస్తున్నారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలన్న చంద్రబాబు సూచనలతో రంగంలోకి దిగిన ఏపీ కేబినెట్ మినిస్టర్స్... జాతీయ స్థాయి నేతలకు ఏమాత్రం తీసిపోని రీతిలో సత్తా చాటుతున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్ లలో ఇప్పటికే ఖాతాలు ఓపెన్ చేసిన మంత్రులు సోషల్ మీడియాలో సత్తా చాటుతున్నారు. మానవవనరుల శాఖ మంత్రి హోదాలో ఉన్న గంటా శ్రీనివాసరావు అందరికంటే ముందు వరుసలో ఉన్నారు. శాఖాపరంగా తాను చేపడుతున్న కార్యక్రమాల వివరాలు, ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న గంటా... నిన్నటి వరకు 50 వేల మందితో భేషనిపించుకున్నారు. ప్రస్తుతం ఆయన పేజీలో 50 లక్షల లైక్స్ ఉన్నాయి. ఇక ఆ తర్వాతి స్థానం జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావుదే. 32,228 లైకులతో దేవినేని రెండో స్థానంలో ఉన్నారు. 16 వేల పైచిలుకు లైకులతో వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మూడో స్థానంలో ఉండగా, 9 వేల లైకులతో రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు నాలుగో స్థానంలో ఉన్నారు. ఇక గనుల శాఖ మంత్రిగా ఉన్న మహిళా మంత్రి పీతల సుజాత 5 వేల లైకులతో ఐదో స్థానంలో, 5 వేల దరిదాపుల లైకులతో అచ్చెన్నాయుడు ఆరో స్థానం, నాలుగు వేల లైకులతో కొల్లు రవీంద్ర ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు. టాప్ ప్లేస్ ఉన్న గంటాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెబుతున్న కారణంగానే గంటా సోషల్ మీడియా సైట్లకు లైకులు వెల్లువెత్తుతున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News