: మిస్ ఫైరా?... కాల్పులా?: గండిపేటలో కలకలం రేపిన కాల్పులు


హైదరాబాదు శివారు ప్రాంతం రంగారెడ్డి జిల్లా పరిధిలోని గండిపేటలో నేటి ఉదయం కలకలం రేపిన కాల్పుల ఘటన పోలీసులకు పెద్ద పనినే అప్పజెప్పింది. గండిపేటలోని పుప్పాలగూడ సర్పంచ్ ప్రశాంతి నివాసానికి వచ్చిన వారి స్నేహితుడి వద్ద ఉన్న పిస్టల్ నుంచి బుల్లెట్లు దూసుకువచ్చాయి. ఒక్కసారిగా కాల్పుల శబ్దంతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఇరుగు పొరుగు నుంచి సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. బుల్లెట్లు దూసుకువచ్చిన పిస్టల్ కలిగిన వ్యక్తిని ప్రభాకర్ గౌడ్ గా గుర్తించిన పోలీసులు అతడి స్వస్థలం వరంగల్ జిల్లాగా నిగ్గు తేల్చారు. అయితే మిస్ ఫైర్ కారణంగా కాల్పులు జరిగాయా? లేక ఉద్దేశపూర్వకంగానే ప్రభాకర్ గౌడ్ కాల్పులకు దిగాడా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

  • Loading...

More Telugu News