: బ్యాంకులోకి చేరిన ‘మల్లన్న’ బంగారం!


కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఆలయాలకు భక్తుల నుంచి కానుకలుగా అందిన బంగారం భద్రంగా బ్యాంకులకు చేరింది. ఈ మేరకు భక్తుల నుంచి ఇప్పటిదాకా మల్లన్న ఆలయానికి అందిన 24.342 కిలోల బంగారాన్ని ఆలయ ఈవో సాగర్ బాబు నిన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన శ్రీశైలం ప్రాజెక్టు కాలనీ శాఖకు అందజేశారు. ఐదేళ్ల పాటు బ్యాంకులో భద్రంగా దాచనున్న ఈ బంగారానికి కాల పరిమితి ముగిసిన తర్వాత అప్పటి బంగారం విలువ ఆధారంగా బంగారం రూపంలోనే వడ్డీ చెల్లిస్తారు. ఈ మేరకు ఆలయం నుంచి బంగారాన్ని అందుకున్న బ్యాంకు అధికారులు సాగర్ బాబుకు గోల్డ్ బాండ్ ను అందజేశారు.

  • Loading...

More Telugu News