: ‘హోదా’తో ఏడాదికి 700 కోట్లే వస్తాయి!... ‘ప్యాకేజీ’తో అయితే 42 వేల కోట్లు వస్తాయి!: కొత్త లెక్కలు చెప్పిన బీజేపీ నేత వీర్రాజు


రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక చిక్కుల్లో చిక్కుకున్న ఏపీకి సాయమందించడంలో కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం అలక్ష్యం చేయదని బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పష్టం చేశారు. కొద్దిసేపటి క్రితం విజయవాడలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా వీర్రాజు సరికొత్త లెక్కలు చెప్పారు. "ప్రత్యేక హోదా ఇస్తే... కేంద్రం నుంచి ఏడాదికి కేవలం రూ. 700 కోట్లు మాత్రమే వస్తాయి. మా వెంకయ్యనాయుడు గారు పదేళ్లు చేస్తామన్నారు. ఆ విధంగా చూసుకుంటే రూ.7 వేల కోట్లు మాత్రమే వస్తాయి" అని ఆయన చెప్పారు. అదే ప్రత్యేక ప్యాకేజీ వస్తే... కేంద్రం నుంచి ఏపీకి ఏడాదికి ఏకంగా రూ.42 వేల కోట్ల మేర నిధులు వస్తాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీనే మేలని ఆయన వాదించారు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరమే లేదని వాదించి ఇటీవల కలకలం రేపిన సోము వీర్రాజు తాజాగా కొత్త లెక్కలు చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.

  • Loading...

More Telugu News