: ప్రకాశం జిల్లాలో దారుణం.. భార్య పిల్లలకు ఉరేసి, ఆపై వ్యక్తి ఆత్మహత్యాయత్నం
ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఉన్న కారణంగా ఓ వ్యక్తి తన భార్య, పిల్లలకు ఉరేపి చంపి, తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పరిధిలో చోటుచేసుకుంది. గత కొంతకాలంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కుంటోన్న చింతలపాలెం వాసి శ్రీనివాసులరెడ్డి ఈ దారుణానికి ఒడిగట్టాడు. తన భార్య, ఇద్దరు పిల్లలు చనిపోయాక తాను కూడా పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పురుగుల మందు తాగి శ్రీనివాసులు పడి ఉండడాన్ని గమనించిన కొందరు ఆయనను ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ప్రస్తుతం శ్రీనివాసులు రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.