: ర్యాలీగా ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకున్న సుజనా చౌదరి, టీజీ వెంకటేష్.. అసెంబ్లీకి చేరుకున్న సురేష్ ప్రభు
టీడీపీ నుంచి రాజ్యసభ సీటుకి టికెట్ పొందిన కర్నూలు నేత టీజీ వెంకటేష్, కేంద్రమంత్రి సుజనా చౌదరి ర్యాలీగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. మరికాసేపట్లో ఏపీ అసెంబ్లీకి వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు కేంద్రమంత్రి సురేష్ ప్రభు కూడా పలువురు మంత్రులతో ర్యాలీగా అసెంబ్లీకి చేరుకున్నారు. తనకు ఏపీ నుంచి అవకాశం ఇచ్చినందుకు సురేష్ ప్రభు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.