: ఏపీ రాజ్యసభ నామినేషన్ కోసం వచ్చిన సురేష్ ప్రభు... తెలంగాణ బీజేపీ నేతలతో బిజీ
ఆంధ్రప్రదేశ్ కోటా నుంచి రాజ్యసభకు నామినేషన్ వేసేందుకు హైదరాబాద్ వచ్చిన కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు, ఈ ఉదయం నుంచి పలువురు తెలంగాణ బీజేపీ నేతలను కలుస్తూ బిజీగా ఉన్నారు. టీ-బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ తో భేటీ అయిన సురేష్ ప్రభు, పార్టీ పరిస్థితులను గురించి అడిగి తెలుసుకున్నారు. పార్టీ నేతలు కిషన్ రెడ్డి, దత్తాత్రేయలతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఆయన బస చేసిన ప్రాంతానికి తరలిరావడంతో ఈ ప్రాంతమంతా సందడి నెలకొంది. మరికాసేపట్లో నామినేషన్ వేసేందుకు వెళ్లనున్న సురేష్ ప్రభు వెంట అసెంబ్లీకి విష్ణుకుమార్ రాజు, కావూరి తదితర బీజేపీ నేతలు తోడు వెళ్తారని తెలుస్తోంది. సురేష్ ప్రభు ఏపీ నుంచి ఎన్నిక కానున్నా, తమ నేత కాబట్టి భారీ ఎత్తున ర్యాలీకి ఏర్పాట్లు చేస్తున్నట్టు హైదరాబాద్ నగర బీజేపీ ప్రకటించింది. బీజేపీ కార్యాలయం నుంచి అసెంబ్లీ వరకూ ఇది సాగుతుందని పార్టీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.