: కలెక్టర్ హీరోయిన్ లా ఉందన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే... సోషల్ మీడియాలో దుమారం, కేసు నమోదు


ఆయనో ప్రజా ప్రతినిధి. రెండు లక్షల మది ఓటర్లకు ప్రతినిధిగా అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రభుత్వ తీరును ఎండగడుతూ చేపట్టిన ఆందోళనలో ఆయన ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి బదులు ఓ మహిళా కలెక్టర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అందంగా, హీరోయిన్ లా ఉన్న కలెక్టర్ నటించడం తానెప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. ఇంకేముంది, సదరు ఎమ్మెల్యేగారి వ్యాఖ్యలు సోషల్ మీడియాకు ఎక్కాయి. నెటిజన్లు విమర్శల జడివాన కురిపించారు. ఆ తర్వాత బీజేపీ నేతల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఇదంతా ఇటీవల ఛత్తీస్ గఢ్ లో బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనలో జరిగిన ఘటన. ఛత్తీస్ గఢ్ లోని సర్ గుజాలో జరిగిన ఈ ఆందోళనలో పాల్గొన్న సీతాపూర్ ఎమ్మెల్యే అమర్ జీత్ భగత్... ఆ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న మహిళా ఐఏఎస్ అధికారి రితూ సేన్ ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసి సమస్యలు కొని తెచ్చుకున్నారు.

  • Loading...

More Telugu News