: కోర్టులపై మనోహర్ పారికర్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ మిస్టర్ క్లీన్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ న్యాయస్థానాలపై నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టుల ఆదేశాలు అర్థరహితమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఢిల్లీలో డీజిల్ వాహనాలను రద్దు చేయాలంటూ ఇటీవల కోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై స్పందించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన కోర్టు ఆదేశాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ఇటీవలే మెర్సిడెజ్ బెంజ్ కంపెనీకి చెందిన ఓ నివేదిక చదివాను. కోర్టు తీసుకున్న నిర్ణయాలు తమకు అర్థం కావట్లేదంటూ వారు భారత దేశంలో పెట్టుబడులు పెట్టడాన్ని నిలిపేశారు. డీజిల్ వాహనాల నిషేధం వెనుక ఉన్న తర్కాన్ని తాము అర్థం చేసుకోలేకపోతున్నామని ఆ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. శాస్త్రీయ ఆధారాలు లేకుండానే అర్థరహిత ఆదేశాలు ఇస్తున్నారు’’ అని పారికర్ వ్యాఖ్యానించారు.