: ‘జంపింగ్’ ఎమ్మెల్యేలకు షాక్!... చంద్రబాబుతో భేటీలోకి సెల్ ఫోన్లకు అనుమతి నిరాకరణ!


‘జంపింగ్’ ఎమ్మెల్యేలకు నిన్న విజయవాడలో షాక్ తగిలింది. రాజ్యసభ బరిలో నాలుగో అభ్యర్థిని బరిలోకి దింపే విషయంపై చర్చించేందుకు రావాలన్న పిలుపుతో ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన 17 మంది ఎమ్మెల్యేలు నిన్న విజయవాడలోని పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నివాసానికి చేరారు. ఈ క్రమంలో చంద్రబాబుతో భేటీకి లోపలికి వెళ్లేందుకు సిద్ధపడ్డ ఎమ్మెల్యేలకు అక్కడి సెక్యూరిటీ సిబ్బంది షాకిచ్చారు. సెల్ ఫోన్లను లోపలికి అనుమతించేది లేదని సెక్యూరిటీ సిబ్బంది చెప్పడంతో ఎమ్మెల్యేలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారట. ఇక చేసేదేమీ లేక సెల్ ఫోన్లను సెక్యూరిటీ వద్దే ఉంచేసిన వారంతా చంద్రబాబుతో భేటీకి లోపలికి వెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News