: పోస్టల్ సర్వీసు ద్వారా గంగాజలం


కేంద్ర ప్రభుత్వం సరికొత్త సౌకర్యం అందుబాటులోకి తీసుకురానుంది. గంగాజలాన్ని పోస్టులో అందించే ఏర్పాట్లు చేసేందుకు కేంద్రం సిధ్దమవుతోందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకరప్రసాద్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఈ కామర్స్ సైట్లతో అనుసంధానమై, పోస్టల్ సర్వీసు ద్వారా గంగా జలాన్ని భక్తులకు చేరవేయనున్నామన్నారు. ఆన్ లైన్ లో గంగాజలం కొనుగోలు చేస్తే పోస్టులో ఇంటికి చేరుతుందని ఆయన చెప్పారు. ఈ మేరకు పోస్టల్ విభాగానికి సూచనలు చేశామని ఆయన చెప్పారు. పోస్టల్ విభాగం అనుకూలమైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాయని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా గంగాజలం అందించాలంటూ ఎన్నో వినతులు వచ్చాయని, అందుకనే గంగాజలం అందించాలనే నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News