: ఏఆర్ రెహ్మాన్ కు అరుదైన పురస్కారం


ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ కు అరుదైన గౌరవం దక్కింది. జపాన్ కు చెందిన ఫుకౌకా ప్రైజ్ 2016 అవార్డును ఈరోజు ఆయన అందుకున్నారు. తన మ్యూజిక్ ద్వారా దక్షిణాసియా దేశాల సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పినందుకుగాను ఆయన ఈ అవార్డును స్వీకరించారు. కాగా, ఫుకౌకా సిటీలోని యొకాతోపియా ఫౌండేషన్ ఈ అవార్డులను ప్రతి ఏటా ఇస్తుంది. ఆసియా సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు పాటుపడిన వ్యక్తులకు లేదా సంస్థలకు, గ్రాండ్ ప్రైజ్, అకడమిక్ ప్రైజ్, ఆర్ట్స్ అండ్ కల్చర్ ప్రైజ్ అనే మూడు కేటగిరిలలో వీటిని బహూకరిస్తారు. మనదేశానికి చెందిన ప్రముఖ చరిత్రకారుడు రామచంద్రగుహ 2015లో అకడమిక్ ప్రైజ్ ను అందుకున్నారు.

  • Loading...

More Telugu News