: ఎంపీపీ కొనుగోలుకు 3 కోట్లు ఆఫర్ చేశారు...ఆధారాలున్నాయి: వైఎస్సార్సీపీ నేత
సంఖ్యాబలం లేకపోయినా నాలుగో అభ్యర్థిని పోటీలో పెట్టిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు 40 కోట్లతో వైఎస్సార్సీపీ నేతలను కొనుగోలు చేసేందుకు వ్యూహం పన్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. మంగళగిరిలో ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ముఖ్యమంత్రి అధికారం అండతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. తమ నియోజకవర్గంలో ఎంపీపీని 3 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసేందుకు ఆఫర్ ఇచ్చారని, దానికి ఆధారాలు ఉన్నాయని ఆయన చెప్పారు. తగిన సమయంలో అవి బయటపెడతామని ఆయన తెలిపారు. ఎమ్మెల్యేలను కొనగలరు కానీ, ప్రజలను కొనలేరని ఆయన వ్యాఖ్యానించారు.