: మామిడిపళ్లతో నితిన్ కు 'ఆల్ ది బెస్ట్' చెప్పిన పవర్ స్టార్
ప్రతి ఏడాది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన మామిడితోటలోని పండ్లను ఆప్తులకు, మిత్రులకు... పంపిస్తుంటాడు. ఇలా ప్రతి యేడు పవన్ పంపించే మామిడి పండ్లు అందుకునే వారిలో యువ హీరో నితిన్ కూడా ఉంటాడు. తాజాగా, ఈ ఏడాది కూడా పవర్ స్టార్ నుంచి మామిడి పండ్ల పార్శిల్ ను నితిన్ అందుకున్నాడు. ఈ విషయాన్ని నితిన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపాడు. మామిడిపళ్ల పార్శిల్ అట్టపెట్టె ఫొటోను కూడా పోస్ట్ చేశాడు. ‘ఆల్ ది బెస్ట్ నితిన్ గారు.. (‘అఆ’), బెస్ట్ విషెస్ ఫ్రమ్ పవన్ కల్యాణ్’ అని ఆ అట్టపెట్టెపై రాసి ఉంది. తనకు అందిన మామిడి పండ్ల పార్శిల్ పై నితిన్ స్పందిస్తూ ...‘థ్యాంక్యూ సార్... దిస్ మీన్స్ ఎలాట్’ అని ట్వీట్ చేశాడు.