: ముస్లిం రిజర్వేషన్ల కోసం ఉద్యమిద్దాం: కోదండరాం


ముస్లిం రిజర్వేషన్ల కోసం ఉద్యమిద్దామని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాం పిలుపునిచ్చారు. కరీంనగర్ లోని సర్కస్ మైదానంలో నిర్వహించిన గర్జనలో ఆయన మాట్లాడుతూ, పాలనలో భాగస్వామ్యం, బడ్జెట్ లో వాటా కోసం ఐక్యంగా ఉద్యమిద్దామని అన్నారు. అధికారంలోకి వస్తే నాలుగు నెలల్లో 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని హామీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి ఆ విషయంలో విఫలమైందని ఆయన తెలిపారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించేంత వరకు సీపీఎం ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడదామని ఆయన పిలుపునిచ్చారు. ఈ గర్జనలో సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం, జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News