: టీటీడీపీ నాయకులు మోకాళ్ల యాత్ర చేసినా లాభం లేదు: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె
ఆలంపూర్ జోగులాంబ ఆలయం నుంచి ఇంద్రవెల్లి దాకా పాదయాత్ర చేస్తానంటూ తెలంగాణ తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మోకాళ్లపై యాత్ర చేసినా లాభం లేదని, తెలంగాణలో టీడీపీ కనుమరుగుకాక తప్పదని వ్యాఖ్యానించారు. తిరుపతిలో నిర్వహించిన మహానాడుపైన, ఏపీ సీఎం చంద్రబాబుపైన కూడా ఆయన విమర్శలు చేశారు.