: అంత పెద్ద స్పిన్నర్ తో నన్ను పోల్చవద్దు: ఆసీస్ బౌలర్ ఆడమ్ జంపా
దిగ్గజ బౌలర్ షేన్ వార్న్ తో తనను పోల్చవద్దని ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా అన్నాడు. జంపా బౌలింగ్ యాక్షన్ వార్న్ ను పోలి ఉండటంతో అతన్ని అందరూ షేన్ వార్న్ తో పోలుస్తుండటంపై స్పందించాడు. అంత పెద్ద స్పిన్నర్ తో తనను పోల్చవద్దని, షేన్ వార్న్ అనే వాడు ఒక్కడే ఉంటాడని, ఏ ఒక్క స్పిన్నర్ ను ఆయనతో పోల్చలేమని అన్నాడు. ఎందుకంటే, షేన్ వార్న్ సాధించిన ఘనతలే ఇందుకు నిదర్శనమని, ఆయన కెరీర్ ఒక అద్భుతమని జంపా కొనియాడాడు. కాగా, వచ్చే నెలలో వెస్టిండీస్ లో జరిగే ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఆసీస్ జట్టులో జంపా స్థానం దక్కించుకున్నాడు.