: ‘చిన్నారి పెళ్లి కూతురు’ మృతి కేసు: ప్రియుడు రాహుల్ రాజ్‌కు సుప్రీంలో ఊర‌ట‌


దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ప్ర‌త్యూష (‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియ‌ల్ ఫేం) మృతి కేసులో ఆమె ప్రియుడికి ఊర‌ట ల‌భించింది. ప్ర‌త్యూష త‌ల్లి కొన్ని రోజుల ముందు రాహుల్ రాజ్ ముందస్తు బెయిల్‌ను ర‌ద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేసింది. అయితే, ఆమె పిటిష‌న్ ను అత్యున్న‌త న్యాయ‌స్థానం ఈరోజు కొట్టివేసింది. ప్ర‌త్యూష ఆత్మ‌హ‌త్య చేసుకున్న త‌రువాత, ఆమె మృతికి ప్రియుడే కార‌ణ‌మ‌ని ప‌లువురు ఆరోపించిన విష‌యం తెలిసిందే. ప్ర‌త్యూష‌ను రాహులే చంపేశాడంటూ ఆరోపిస్తూ ఆమె త‌ల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. త‌మ కూతుర్ని చంపేసిన రాహుల్‌కి ముంద‌స్తు బెయిలు ఇవ్వొద్ద‌ని కోరారు. ముంద‌స్తు బెయిలు రద్దు అంశం ప‌రిశీల‌న కోసం మ‌హారాష్ట్ర పోలీసులను ప్ర‌శ్నించిన కోర్టు చివ‌రికి బెయిలు ర‌ద్దు పిటిష‌న్‌ను తిర‌స్క‌రించింది.

  • Loading...

More Telugu News