: అబుదాబీ హోటళ్లలో బిల్లు ఇక మరింత ప్రియం
అబుదాబీ హోటళ్లలో బిల్లులు మరింత ప్రియం కానున్నాయి. ఇకపై అక్కడ టూరిస్టులు బస చేయాలంటే అధిక ఛార్జీలు చెల్లించాల్సిందే. హోటల్ బిల్లులో నాలుగు శాతం మున్సిపల్ పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. అంతేగాక ఒక్కో రూమ్‌కి ప్రస్తుతం చెల్లిస్తోన్న ఛార్జీల కన్నా ఒక రాత్రికి 15 దిర్హామ్స్ అధికంగా చెల్లించాల్సిందే. ఈ ఛార్జీలు వచ్చేనెల ఒకటి నుంచే అమలులోకి రానున్నట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. దీని కోసం సంబంధిత అధికారులు ఇప్పటికే కసరత్తు చేపట్టారు. అధిక ఛార్జీల వసూలు అంశాన్ని టూరిస్టులకు తెలియజేస్తున్నారు. బిల్లు చెల్లింపు, పన్ను వసూలు అంశాలపై సిబ్బందికి అవగాహన కార్యక్రమాలను కూడా చేపట్టారు.