: ఒలింపిక్స్‌లో పోటీకి దిగనున్న కవలలుగా లీల, లీనా, లిల్లీ రికార్డు
త్వరలో ప్రారంభం కానున్న రియో ఒలింపిక్స్ మారథాన్ విభాగంలో లీల, లీనా, లిల్లీ అనే ముగ్గురు కవలలు పాల్గొననున్నారు. ఈ విధంగా వీరు ఒలింపిక్స్ చరిత్రలో అరుదైన రికార్డు నెలకొల్పబోతున్నారు. ఇంతవరకు ఒలింపిక్స్‌లో ఒకే వేదికపై ముగ్గురు కవలలు కలిసి పాల్గొనలేదు. ఎస్టోనియా దేశానికి చెందిన ఈ ముగ్గురు అమ్మాయిలు ఇప్పుడు ఒకేసారి పాల్గొననుండంతో ఆ రికార్డు వీరి సొంతం కానుంది. 1985 ఆగస్టు 14న ఈ ముగ్గురు కవలలు జన్మించారు. బ్రెజిల్‌లోని రియో డి జెనీరోలో ఆగస్టు 5 నుంచి 2016 ఒలింపిక్స్ ప్రారంభం కానుంది. ఒలింపిక్స్‌లో పాల్గొని కనీసం ఒక్క పతకంతోనైనా తిరిగి తమ దేశానికి వెళతామని ఈ కవలలు చెబుతున్నారు.