: కృష్ణా పుష్కరాలను బహిష్కరించండి: బైరెడ్డి సంచలన పిలుపు


త్వరలో జరిగే కృష్ణా పుష్కర పనుల్లో అంతులేని అవినీతి జరుగుతోందని రాయలసీమ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. కర్నూలు జిల్లా వాసులంతా తెలుగుదేశం నేతల అవినీతిని ఎండగడుతూ, కృష్ణా పుష్కరాలను బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రజలు వచ్చే ప్రాంతాల్లో పుష్కర ఘాట్లను నిర్మించకుండా, తెలుగుదేశం నేతల ఇళ్లకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఘాట్లను నిర్మిస్తున్నారని, వీటివల్ల యాత్రికులకు ఎలాంటి ఉపయోగాలు ఉండబోవని అన్నారు. పులివెందుల నుంచి కుప్పం వరకూ రాయలసీమ వాదం బలంగా ఉందని తెలిపారు. కాగా, పుష్కర ఘాట్ల పనులను నిరసిస్తూ, పగిడ్యాల మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు తమ ఇండ్లపై నల్ల జెండాలను ఎగురవేసి, బ్యానర్లు కట్టడం గమనార్హం.

  • Loading...

More Telugu News