: ఏపీ నుంచి రాజ్యసభ సీటు ఎందుకివ్వలేదో తెలియదు: నిర్మలా సీతారామన్
తనకు సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సీటును ఎందుకు ఇవ్వలేదో తెలియదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆమె, రేపు బెంగళూరు వెళ్లి రాజ్యసభ అభ్యర్థిత్వానికి నామినేషన్ దాఖలు చేయనున్నట్టు తెలిపారు. తనకు ఏపీ నుంచి సీటు ఇవ్వాలని చంద్రబాబు సర్కారును కోరలేదని ఆమె తెలిపారు. అధిష్ఠానం నిర్ణయానుసారం నడచుకోవడమే తన విధి అని వివరించారు. పార్టీ కర్ణాటక నుంచి నామినేషన్ వేయాలని తెలిపిందని స్పష్టం చేశారు. మరో బీజేపీ నేతకు ఏపీ నుంచి సీటు లభిస్తుందా? అన్న ప్రశ్నకు ఆమె సమాధానాన్ని దాటవేశారు.