: పుదుచ్చేరిలో ప్రభుత్వ ఏర్పాటుకు కదిలిక... లెఫ్టినెంట్ గవర్నర్ ను కలసిన కాంగ్రెస్
పుదుచ్చేరిలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో మొత్తం 30 సీట్లలో కాంగ్రెస్-డీఎంకే కూటమి 17స్థానాల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక, పార్టీలో అంతర్గత విభేదాలతో కాంగ్రెస్ ఇంకా పుదుచ్చేరిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన మిగతా నాలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రభుత్వాల ఏర్పాటు జరిగింది. పుదుచ్చేరిలో మాత్రం సీఎం అభ్యర్థి ఎన్నికపై ఫలితాలు వెలువడిన నాటి నుంచి సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో పార్టీ అధిష్ఠానం రెండు రోజుల క్రితం సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి వి.నారాయణస్వామిని ముఖ్యమంత్రిగా నియమించనున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్-డీఎంకే కూటమి కదిలింది. పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడీతో నారాయణ స్వామి ఈరోజు భేటీ అయ్యారు. పుదుచ్చేరిలో ప్రభుత్వ ఏర్పాటు చేయగలమని ఆయన గవర్నర్ కు తెలిపారు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.