: భర్తే బ్రోకరయ్యాడన్న మహిళ రోదన పట్టని అధికారులు!... నల్లగొండలో వివాహిత సూసైడ్!


కట్టుకున్నోడు, తల్లిలా చూడాల్సిన అత్తలే తనను వ్యభిచార కూపంలోకి నెడుతున్నారని, తనను ఆ విపత్కర పరిస్థితి నుంచి రక్షించాలని ఓ వివాహిత చేసిన వినతి ఏ ఒక్క అధికారినీ కదిలించలేకపోయింది. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో పాటు జిల్లా జడ్జీ కార్యాలయం నుంచి కూడా తనకు రక్షణ కల్పిస్తామన్న హామీ రాకవపోవడంతో ఆ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ దయనీయ ఘటన నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం నోములలో నేటి ఉదయం జరిగింది. వివరాల్లోకెళితే... వ్యభిచారం చేయాలంటూ తనను భర్త, అత్తలు బలవంతం చేస్తున్నారంటూ గ్రామానికి చెందిన ఝాన్సీ అనే వివాహిత జిల్లా కలెక్టర్, ఎస్పీ, జడ్డి కార్యాలయాలకు లేఖలు రాసింది. ఈ లేఖలను సదరు అధికారులు చూశారో, లేదో తెలియదు కాని... ఏ ఒక్క కార్యాలయం కూడా స్పందించిన దాఖలా ఝాన్సీకి కనిపించలేదు. దీంతో మరణమే శరణ్యమంటూ ఝాన్సీ ఆత్మహత్య చేసుకుంది. చనిపోతూ తాను అనుభవించిన నరక యాతన, భర్త పెట్టిన చిత్రహింసలను కళ్లకు కడుతూ ఓ లేఖ రాసి మరీ ఆత్మహత్య చేసుకుంది.

  • Loading...

More Telugu News