: మహానాడు నుంచి తిరిగొస్తుంటే, విజయవాడ కార్పొరేటర్ కు యాక్సిడెంట్


తిరుపతిలో జరిగిన మూడు రోజుల మహానాడు కార్యక్రమంలో తన కుటుంబసభ్యులతో సహా హాజరై తిరుగు ప్రయాణమైన విజయవాడ 44వ డివిజన్ కార్పొరేటర్ కాకు మల్లికార్జునరావు ప్రయాణిస్తున్న కారుకు నాగార్జునా యూనివర్శిటీ వద్ద యాక్సిడెంట్ జరిగింది. తెల్లవారుఝామున డ్రైవర్ తనకు నిద్ర వస్తున్నదని చెప్పగా, కారును స్వయంగా మల్లికార్జునరావు నడుపుతున్న వేళ, అది అదుపుతప్పి డివైడర్ ను ఢీకొని పూర్తిగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో కారులోని ఆయన భార్య తదితరులకు తీవ్రగాయాలు కాగా, వారిని విజయవాడలోని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. వేగంగా వెళుతుండటమే ప్రమాదానికి కారణమని తెలుస్తుండగా, సీటు బెల్టు పెట్టుకోవడమే తన ప్రాణాలు పోకుండా కాపాడిందని మల్లికార్జునరావు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News