: మహిళలకు ఆయుధ శిక్షణనిచ్చిన వీహెచ్‌పీ.. భజరంగ్ దళ్ దారిలోనే దుర్గావాహిని
కొన్ని రోజుల క్రితం భజరంగ్ దళ్ నిర్వహించిన శిబిరంలో యువకులకు ఆయుధ శిక్షణనివ్వడంపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ వివాదం చల్లారకముందే విశ్వహిందూ పరిషత్ అనుబంధ సంస్థ అయిన దుర్గావాహిని ఉత్తరప్రదేశ్ వారణాసిలో మహిళలకు ఆయుధ శిక్షణనిచ్చింది. దీంతో మరోసారి తీవ్ర స్థాయిలో దుమారం చెలరేగుతోంది. మహిళలు రైఫిల్స్ సహా పలు ఆయుధాలు పట్టుకొని శిక్షణ తీసుకున్నారు. వచ్చే ఏడాది యూపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ లబ్ధి పొందడానికే వీహెచ్‌పీ ఇటువంటి సాహసం చేస్తోందని కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే మహిళలు సమాజం నుంచి ఎదుర్కుంటోన్న హింస నుంచి తమని తాము రక్షించుకోవడానికే ఈ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని వీహెచ్‌పీ నేతలు అంటున్నారు.