: జగన్ కు అండగా కేవీపీ, ఉండవల్లి, వట్టి ఎందుకు లేరంటే..!


కాంగ్రెస్ పార్టీని వదిలి సొంత కుంపటి పెట్టుకున్న వేళ, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న పలువురు నాయకులు జగన్ తో ఎందుకు కలిసి వెళ్లలేదన్న ప్రశ్నకు కేవీపీ సమాధానం ఇచ్చారు. వైఎస్ మరణం తరువాత కుటుంబ పెద్దగా కేవీపీ, వైఎస్ సన్నిహితులుగా ఉండవల్లి, వట్టి వసంతకుమార్ వంటి నేతలు జగన్ వెంట ఎందుకు వెళ్లలేదు? అన్న ప్రశ్నకు "నేను మీకు సవినయంగా చేతులు జోడించి చెబుతున్నాను. మీకు నేను చెప్పే లాస్ట్ సమాధానం ఇదే. రాజీవ్ గాంధీతో ఆశీర్వదించబడిన రాజశేఖరరెడ్డిగారి యొక్క ఆత్మ, కాంగ్రెస్ పార్టీ తోటి ఉండమని మమ్మల్ని నిర్దేశించింది. మేము కాంగ్రెస్ పార్టీలో ఉండటం జరిగింది. దీని మీద మీరు మరిన్ని ప్రశ్నలు అడిగితే నేనింక మాట్లాడను" అన్నారు.

  • Loading...

More Telugu News